CTR: వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. పుంగనూరు పరిధిలో ముల్బాగల్కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వాహనం పూర్తిగా దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.