TPT: ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ వయోపరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ను లెక్చరర్లు శుక్రవారం కలిసి తమ సమస్యను వివరించారు. ప్రస్తుత వయోపరిమితి కారణంగా అనేకమంది అర్హులైన లెక్చరర్లు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు.