తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. చిన కొండేపూడి గ్రామానికి చెందిన పేడూరి చిట్టిబాబు గురువారం వడ దెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అతనే ఆధారమని, అతని మృతితో ఆమె ఒంటరి అయిందని, ఆమెను చూసుకునేవారే లేరని గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.