MBNR: జడ్చర్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుటుంబ కలహలు, ఆర్థిక సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనలో రవి (26) అనే యువకుడు మృతి చెందగా, అతని తల్లి మీనాక్షి (52) పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.