పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.230 కోట్లకుపైగా వసూలుచేసింది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ తమిళ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో PS1 రూ.82.5 కోట్లతో టాప్ 4లో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో రోబో 2.0, కబాలీ, బీస్ట్ చిత్రాలున్నాయి. సెప్టెంబర్ 30న ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఇదే స్పీడ్తో కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియోట్ చేయనుంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.500 కోట్లు కాగా, పార్ట్ 1 బడ్జెట్ రూ.250 కోట్లుగా ఉంది.
పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా..మణిరత్నం, సుహాసిని, సుభాస్కరన్ అల్లిరాజా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటించారు. AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.