2005లో శ్రీలంకపై ధోనీ ఆడిన 183 పరుగుల భారీ ఇన్నింగ్స్ నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీలంక ఇచ్చిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగాడు. 145 బంతుల్లోనే 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183* పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పటికీ ఈరికార్డు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.