ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 17న కొందరు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి నగలు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేశారని బెన్ స్టోక్స్ ప్రకటించాడు. దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలన్న క్రికెటర్.. తనకు ఎంతో సెంటిమెంట్ అయిన వస్తువులు పట్టుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్న సమయంలో చోరీ జరిగినట్లు చెప్పాడు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.