SK Bhagavan సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీఎం సంతాపం
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు. ఇక మరో దర్శకుడు దొరైతో కలిసి భగవాన్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. దాదాపు 30 నుంచి 40 సినిమాల దాకా వీరిద్దరూ కలిసి పని చేశారు. 2000 సంవత్సరంలో దొరై కన్నుమూయగా.. తాజాగా భగవాన్ తుదిశ్వాస విడిచారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఇప్పటికే నందమూరి తారకరత్న మృతితో సినీ లోకం విషాదంలో మునగగా.. తాజాగా సీనియర్ దర్శకుుడ కన్నుమూశాడు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కన్నడ సీనియర్ దర్శకుడు ఎస్ కే భగవాన్ (90) (SK Bhagavan) తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai)తో పాటు కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి కన్నడలో టాప్ దర్శకులలో ఒకరిగా భగవాన్ పేరు ప్రఖ్యాతులు పొందాడు.
జయదేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతి చెందారు. 1933 జూలై 5న జన్మనించి భగవాన్ కు సినిమాలపై ఆసక్తి. చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఉన్న భగవాన్ మొదట సహాయ దర్శకుడిగా పని చేశారు. అనంతరం మైక్ అందుకున్నారు. కన్నడ దిగ్గజ నటుడు దివంగత కంఠీరవ రాజ్ కుమార్ తో అత్యధిక సినిమాలు తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు. ఇక మరో దర్శకుడు దొరైతో కలిసి భగవాన్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. దాదాపు 30 నుంచి 40 సినిమాల దాకా వీరిద్దరూ కలిసి పని చేశారు. 2000 సంవత్సరంలో దొరై కన్నుమూయగా.. తాజాగా భగవాన్ తుదిశ్వాస విడిచారు.