E.G: కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన కోన అరుణ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ సహాయం కోరగా, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 3,02,320 విలువైన ఎల్ఓసీని బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.