NZB: జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇళ్ల స్థితిగతులపై నివేదిక కోరారు. అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తూ, అర్హులకు త్వరితగతిన ఇళ్లు అందజేయాలని స్పష్టం చేశారు.