KMM: మధిర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని కే.వీ.ఆర్ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.