ప్రకాశం: మేదరమెట్ల ప్రభుత్వ వైద్యశాల నందు వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సమావేశం మండల MPP ప్రసన్న కుమారి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలకు సంబంధించి వివిధ ఖర్చులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చిట్టిబాబు, నిఖిలరెడ్డి, MPDO రాజ్యలక్ష్మి, మేదరమెట్ల సర్పంచ్ యలిసమ్మ, గుడిపాడు సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.