AP: వైఎస్ కుటుంబం ఆస్తుల విషయంపై బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.ఆస్తుల వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలంటే మధ్యస్థంగా ఉండాలన్నారు. ఒకరివైపు మాట్లాడేవారు జడ్జి ఎలా అవుతారని ప్రశ్నించారు. YCP నుంచి వెళ్ళిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారన్నారు. బాలినేని విషయంలో ఇప్పుడు అవసరాల కోసం చేసే రాజకీయాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.