AP: వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. ‘వివేకా గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి దొరికిపోయారు. కోడికత్తి అని దాడి మీరే చేయించుకుని అభాసుపాలయ్యారు. కొట్టేసిన సొమ్మును పంచుకోండని వైఎస్సార్ చెప్తే.. అది చేతగాక మాపై ఏడుస్తారా? ఆడవాళ్ల చీరలపై మాట్లాడుతున్న విజయసాయిరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులే బడితపూజ చేస్తారు. జగన్ కుటుంబ వివాదాన్ని రాష్ట్ర సమస్యగా, దేశ సమస్యగా చిత్రీకరించడం దారుణం’ అని పేర్కొన్నారు.