బారామతి స్థానంలో ఎన్సీపీ (ఎస్పీ) తరపున యుగేంద్ర పవార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్, ఎంపీ సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ స్థానంలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త తరం నాయకత్వాన్ని ఆదరించాలని శరద్‌పవార్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.