పీఎంవో నుంచి వచ్చిన లేఖకు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స్పందించాడు. సుదీప్ తల్లి సరోజా సంజీవ్(86) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ వచ్చింది. దీనిని తాజాగా ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో మీ మాటలు నాతో ధైర్యాన్ని నింపాయి’ అని పేర్కొన్నారు.