కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మదర్ థెరెసాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న రాజీవ్ గాంధీ హత్య జరిగిన కొద్దిరోజులకు మదర్ థెరెసా మమ్మల్ని పలకరించడానికి ఇంటికి వచ్చారు. నిరుపేదల కోసం పనిచేయాలని నన్ను ఆహ్వానించారు. నేను వారి సంస్థతో కలిసి పని చేయడానికి వెళ్లాను. అదేవిధంగా వయనాడ్ బాధితులకు మీరు సహాయం చేశారు’ అని పేర్కొన్నారు.