ASR: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా ఆహారం పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ చిన్నస్వామి కోరారు. సోమవారం పార్టీ నేతలతో అరకులో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, అక్షయపాత్ర ఫౌండేషన్ వల్ల గిరిజనులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.