TG: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో మార్పులు చోటు చేసుకున్నాయి. బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తుండటంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సెక్యూరిటీలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఇంటి దగ్గర బెటాలియన్ పోలీసులకు బదులుగా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.