ASF: తిర్యాణి మండలం ఎదులపాడు గ్రామంలో గురువారం రెబ్బెన CI సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. CI మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.