Megastar Chiru : చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టిన మెగాస్టార్!
Megastar Chiru : ఆర్ఆర్ఆర్ మూవీ మొదలైనప్పటి నుంచి మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతునే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి.. ఆస్కార్ బరిలో నిలిచినా.. ఫ్యాన్స్ లొల్లి ఆగడం లేదు. తాజాగా చిరు చేసిన ఓ ట్వీట్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేసింది. ట్రిపుల్ ఆర్ మూవీలో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.
ఆర్ఆర్ఆర్ మూవీ మొదలైనప్పటి నుంచి మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతునే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి.. ఆస్కార్ బరిలో నిలిచినా.. ఫ్యాన్స్ లొల్లి ఆగడం లేదు. తాజాగా చిరు చేసిన ఓ ట్వీట్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేసింది. ట్రిపుల్ ఆర్ మూవీలో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇద్దరు సినిమాకు ప్రాణం పెట్టారు.. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాటు నాటు పాటను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం ఈ ఇద్దరికి మాత్రమే అంటే.. ఎవరు ఒప్పుకోరు. ట్రిపుల్ ఆర్ క్రెడిట్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళిదే. చారణ్, తారక్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే ఇచ్చేసినట్టుగా వేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా పై హాలీవుడ్ దగ్గజ దర్శకుడు జేమ్స్ కెమరూన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే జేమ్స్.. తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ క్యారెక్టర్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇదే వీడియోని తాజాగా ట్విట్టర్లో షేర్ చేశారు మెగాస్టార్. జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు.. చరణ్ పాత్రను ప్రశంసించడం.. తనకి ఆస్కార్ లాంటిదేనని.. ఇది ఒక గొప్ప గౌరవం.. ఓ తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది.. ఈ ప్రశంసలు చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు ఆశీర్వాదాలు.. అని మెగాస్టార్ రాసుకొచ్చారు. అయితే ఒక తండ్రిగా చిరుకి ఇది నిజంగానే ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ ఈ ట్వీట్ మాత్రం వివాదంగా మారింది. చిరు కేవలం చరణ్‌కు మాత్రమే RRR సక్సెస్ క్రెడిట్ ఇచ్చినట్టు ఈ ట్వీట్ ఉందని అంటున్నారు కొందరు. ట్వీట్లో ఎన్టీఆర్ పేరు లేకపోయినా.. కనీసం రాజమౌళి పేరుని కూడా ప్రస్థావించక పోవడం ఏంటని.. కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో మెగా, నందమూరి ఫ్యాన్స్ కాస్త గట్టిగానే వాదించుకుంటున్నారు. మరి దీనిపై మెగాస్టార్ స్పందిస్తారేమో చూడాలి.