ఇరాన్లో పోలీసు వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీస్ అధికారులు మృతి చెందారు. సిస్థాన్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. పోలీసులపై దాడిని అక్కడి ప్రభుత్వం తీవ్ర ఖండించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.