SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం ఆశ్వయుజ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామిని కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆదివారం తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలచిన వారు 500 రూపాయలు చెల్లించాలని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించారని పేర్కొన్నారు.