VZM: చీపురుపల్లికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త రెడ్డి రమణ కన్నుమూశారు. ఇటీవల అప్పన్నపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఈయన మొబైల్ బైక్ లైబ్రరీ ఎంతోమంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. సొంత ఖర్చులతో ఎన్నో అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు.