భారత్లో సుమారు 1600 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషగా హిందీ(52.82 కోట్ల మంది) నిలిచింది. తర్వాత స్థానాల్లో బెంగాలీ(9.72 కోట్లు), మరాఠీ(8.30 కోట్లు), తెలుగు(8.11 కోట్లు), తమిళం(6.90 కోట్లు), గుజరాతీ(5.54 కోట్లు), ఉర్దూ(5.07 కోట్లు), కన్నడ(4.37 కోట్లు), ఒడియా(3.75 కోట్లు), మలమాళం(3.48 కోట్లు) నిలిచాయి. కాగా, భారత్లో ఎలాంటి జాతీయ భాష లేదు.