TG: సమాజంలో చేతివృత్తులు కనుమరుగవతున్న నేపథ్యంలో వారికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. HYDలోని కవాడిగూడలో రూ.26 లక్షల వ్యయంతో దోబిఘాట్ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న క్రమంలోనూ చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వేలాది మందికి నైపుణ్య శిక్షణ, పరికరాలు అందించడంతోపాటు ఆర్థికసాయం అందిస్తామన్నారు.