అన్నమయ్య: మదనపల్లె మండలం, ఇసుకనూతి పల్లెలో కబ్జాకు గురి అయిన దారిని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రెవెన్యూ, పంచాయతీ సెక్రెటరీ, పోలీసులు, ఎంపీడీవోతో కలిసి కబ్జాకు గురి అయిన దారిని ఎమ్మెల్యే పరిశీలించి సమస్యను పరిష్కరించారు. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.