AP: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖుల మినహా సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈనెల 30న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.