ATP: అనంతపురం నగరంలోని బీజేపీ కొట్టాలలో ఆదివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి బీహార్‌కు చెందిన ముగ్గురికి యువకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.