TVK చీఫ్ విజయ్ తన తొలి సభలోనే పలు విమర్శలకు చెక్ పెట్టారు. ఆర్టిస్టులు రాజకీయాల్లోకి ఎందుకని విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ, తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన NTR, MGRలు కూడా ఆర్టిస్టులేనని గుర్తు చేశారు. ‘నా కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలు వదిలేసి మీకోసం రాజకీయాల్లోకి వచ్చా.. నన్ను ఆశీర్వదించండి’ అంటూ అభిమానులను కోరారు.