PDPL : ఎలిగేడు మండలంలో ర్యాకల్ దేవ్ పల్లె గ్రామానికి చెందిన బుర్ర రమేష్ అతని భార్య రమ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. వారికి హర్షిత, సుచిత ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ZPHS ఎలిగేడు SSC- 2003-04 బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు. వారి చదువులకు రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.