కృష్ణా: పెదపారుపూడి గ్రామంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ణ కుమార్ రాజా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చప్పిడి సమీరా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.