ఇరాన్‌పై జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ‘ఇరాన్ దాడికి ప్రతిస్పందిస్తామని చెప్పాం. అందులో భాగంగా నిన్న దాడి చేశాం. కచ్చితత్వంతో కూడిన శక్తివంతమైన దాడులు చేశాం. ఈ క్రమంలో మా లక్ష్యాలన్నింటినీ సాధించాం’ అని పేర్కొన్నారు. ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.