GNTR: ప్రత్తిపాడులో యనగందుల వీరారావు అనే కౌలు రైతు పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు GGHకి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.