HYD: ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉన్నత విద్యావ్యవస్థ విధ్వంసానికి గురైందని ఆరోపించారు. ఆదివారం విద్యానగర్లో తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదండరాంను సన్మానించారు.