యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటటా తెరకెక్కుతున్న మూవీ ‘డ్యూయెట్’. మిథున్ వరదరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రితికా నాయక్ బర్త్ డే సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో రితికా బీచ్ పక్కన కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సినిమాని కేఈ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.