విశాఖ: అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని అరకు సీఐఎల్ హిమగిరి స్పష్టం చేశారు. బాణాసంచ తయారి, నిల్వలు, విక్రయాలు చేసేందుకు పోలీసువారి అనుమతి తప్పనిసరి అని సిఐ చెప్పారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలన్నారు.