విశాఖ: కేజీహెచ్‌లో మృతి చెందిన గిరిజన విద్యార్థి బడ్నాయిని ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. అరకులోయ పీవీటీజీ గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యార్థి మృతదేహానికి ఆదివారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు.