మనం తీసుకునే పదార్థాలలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలుంటాయి. అందులో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఒకటి. దీనిలో పోషకాలతోపాటు, విటమిన్ A, D, B6, B12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో రొమ్ముక్యాన్సర్ రాకుండా నిరోధించడంతోపాటు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్ A కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డు సొనలో ఉంటే కోలిన్ మెదడు కణాలను కాపాడుతుంది. నరాల బలహీనత, గుండె రక్తనాళాలకు కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.