KKD: జిల్లా కలెక్టర్ వద్ద సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని ప్రకటనలో తెలియజేశారు.