కృష్ణా: కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్, సస్పెక్ట్ షీట్ హోల్డర్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీట్ నమోదైన వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. మండలంలో శాంతియుత వాతావరణం ఏర్పడటానికి తమకు సహకారం అందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.