SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాలని గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరి ధాన్యం తూకం వేసిన తర్వాత 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు.