TG: జన్వాడ పార్టీపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అక్రమ మద్యం దొరికిందని తెలిసింది. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి. అప్పట్లో BRS ఫామ్‌హౌస్ ఫైల్స్ సినిమా తీసింది. స్వామీజీ పేరు చెప్పి మా పార్టీపై ఆరోపణలు చేసింది. అదంతా ఫేక్ అని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు కుట్రకేసు పెడుతుందని BRS చెబుతుంది. పార్టీ ఏదైనా కుట్రకేసులు పెట్టడం సరికాదు’ అని పేర్కొన్నారు.