చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్యారా బుల్లితెరపై వచ్చిన యంగ్ హీరోయిన్ అవికా గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను రక్షించాల్సిన తన బాడీగార్డే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఎమోషనల్ అయింది. చాలా ఈవెంట్స్‌లలో తన బాడీగార్డు దారుణంగా తాకరాని చోట తాకాడని చెప్పింది. అతడు నన్ను చాలా సార్లు మానసికంగా బాధించాడని తెలిపింది. తన లైఫ్ జర్నీలో ఇలాంటి ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.