KDP: ఖాజీపేట మండలంలోని కన్నెలవాగు చెరువుకు కృష్ణా జలాలతో నింపుతామని ఎన్నికల ప్రచార సమయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం కృష్ణా జలాలతో పూర్తిగా నింపారు. ఈ సందర్బంగా ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఖాజీపేట పర్యటనలో భాగంగా కన్నెలవాగు చెరువును పరిశీలించారు. కన్నెలవాగు చెరువుకు నీరు నింపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.