శ్రీకాకుళం: హిరమండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997 పదో తరగతి బ్యాచ్లో చదువుకున్న కోరాడ ఫణిధర్ విద్యుత్ షాక్ ఘటన కారణంగా కాళ్లు చేతులు తొలగించారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఫణిధర్ కుటుంబ సభ్యులకు రూ. 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో వి.రాజు, యస్.సాంబశివరావు జి. గణేష్, పి. రమేష్, జె. నాగరాజు, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.