E.G: పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆదివారం రాజమండ్రి గోదావరి నదిలో బ్రిడ్జిలంకలో ఆహ్వానం కిచెన్ ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు తెస్తామన్నారు.