ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను తమ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని ప్రకటించారు. ఈ ప్రచారంలో దేశప్రజలు భాగస్వాములు కావాలని.. వారి జయంతిని జరుపుకోవాలని కోరారు. సర్దార్ పటేల్, బిర్సా ముండా ఇద్దరూ విభిన్న సవాళ్లను ఎదుర్కొన్న గొప్ప వ్యక్తులని.. అయితే వారి దృష్టి ఒక్కటేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు.