ATP: గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఆదివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బసినేపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.