WNP: రైతు భరోసాను ఎగ్గొట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని పెబ్బేరు బీఆర్ఎస్ అధ్యక్షుడు దిలీప్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 29 న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో నిర్వహించే రైతు నిరసన సదస్సుకు హాజరుకావాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.